తెలంగాణలో సంచలనంగా మారిన.. విచారణలో పోలీసులకు సవాల్ గా మారిన మీర్ పేట మర్డర్ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసుల విచారణలో నమ్మశక్యం కాని నిజాలు బయటికి వస్తున్నాయి.
మీర్పెట్ భార్య హత్య కేసులో నిందితుడు ఫోన్ కాల్స్ పై వివరాలు సేకరించారు పోలీసులు. హత్యకు ముందు హత్య తర్వాత ఎవరితో మాట్లాడడా అనే అనుమానంతో కాల్ లిస్ట్ చెక్ చేశారు పోలీసులు
భార్యను అతి కిరాతకంగా హత్య చేసి, 72 ముక్కలుగా నరికిన తర్వాత హంతకుడు గురు మూర్తి 8 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత తన స్నేహితుడితో మాట్లాడిన గురుమూర్తి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్స్ బుక్ చేసినట్లు తేల్చారు. బడంగ్ పెట్ లో ఉంటున్న సోదరినికి ఫోన్ చేసి మాట్లాడు గురుమూర్తి. ఫోన్ డేటా ఆధారంగా గురుమూర్తి స్నేహితుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి హత్య పై అరా తీశారు పోలీసులు.