తెలంగాణ

అల్లాపూర్ SHO వెంకట్ రెడ్డిని ఘనంగా సన్మానించిన దేవరింటి మస్తాన్ రెడ్డి

కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ లో గణేష్ నవరాత్రోత్సవాలు దిగ్విజయం కావడానికి శ్రమించిన అల్లాపూర్ SHO వెంకట్ రెడ్డి గారిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పోలీసుల సహకారంతోనే గతంలో ఎప్పుడు లేనంత ఘనంగా, ప్రశాంతంగా వినాయక నవరాత్రోత్సవాలు జరుపుకున్నామని ఈ సందర్భంగా దేవరింటి మస్తాన్ రెడ్డి అన్నారు. గణేష్ వేడుకల నిర్వహణలో సీఐ వెంకట్ రెడ్డి గారు, సబ్ ఇన్స్ పెక్టర్ మాజిద్ అలీ ఇచ్చిన సహకారం మరవలేమన్నారు. V TEAM, శ్రీ వివేకానంద నగర్ కాలనీ ప్రజల తరపున అల్లాపూర్ పోలీసులకు మస్తాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ మొయినొద్దీన్, V TEAM ప్రధాన కార్యదర్శి రవీందర్ ముదిరాజ్, సీనియర్ అడ్వైజర్ చెల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, పవన్ కుమార్, యూత్ ప్రెసిడెంట్ బొంత రవి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button