తెలంగాణ

మర్రిగూడ ఉపాధికి అధికారి కరువు…

మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న పనులలో జిల్లాలోనే ఎక్కువ ఖర్చు జరిపిన మండలాలలో మొదటి వరుసలో ఉండే మర్రిగూడకు నేడు ఎపిఓ కరువయ్యారు.. గతంలో ఇక్కడ పనిచేసిన వెంకటేశం నాంపల్లి మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన ట్రాన్స్ఫర్ అయి కూడా సుమారు సంవత్సర కాలం కావస్తుంది.. ఇలా అనేక మార్లు ఇక్కడ ఎపిఓ సీట్ కు నెలల తరబడి ఇంచార్జ్ లే ఫుల్ ఛార్జ్ లా పనిచేస్తున్నారు.. అధిక పని వత్తిడి ఉండే ఈ మండలంలో డబల్ డ్యూటీలు సరి కాదని మండల వాసులు అంటున్నారు.. అత్త వేషం కొడలి వేషం ఒకరే వెయ్యటం, సామాజిక తనిఖీలో వెలుగు చూసే అవినీతిలకు ఇదే పెద్ద సాకు కావటం సిబ్బందికి వరంగా మారిందనే చెప్పుకోవాలి.. అవినీతి లేని మండలంగా మర్రిగూడ ఎన్నో సార్లు జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకుందని చెప్పుకోవచ్చు.

అలాంటి మంచి పేరున్న మండలానికి అధికారి లేకపోవడంతో అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు స్థానికులు.. క్షేత్ర స్థాయి సిబ్బంది తమ పరిధిలో న్యాయంగా పనిచేస్తున్నప్పటికి, పర్యవేక్షణ నిర్లక్ష్యం పొరపాట్లకు దారితియ్యవచ్చని చర్చ.. జిల్లాలోనే మ్యాన్ డేస్ అధికంగా ఉండే మండలాలలో మర్రిగూడ మొదటి స్థానంలో ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు.. అలాంటి మండలం ఇలాంటి కారణాల చేత వెనుకబడటం, ప్రభుత్వం అందించే ఉపాధిని ప్రజలకు దూరం చెయ్యటమవుతుందని అనుకుంటున్నారు మండల ప్రజలు.. ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న ఈసి వివేక్, రెండేసి పనులను చూడటం కూడా ఇబ్బందే అంటున్నారు కూలీలు.. కావున మర్రిగూడ మండలానికి ఎపిఓ ను వెంటనే ఇవ్వాలని జిల్లా ఉన్నత అధికారులను ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి .. 

  1. AI అంటే అనుముల ఇంటెలిజెన్స్.. కవిత సంచలన వ్యాఖ్యలు

  2. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్

  3. కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!

  4. టీడీపీ నెక్ట్స్‌ టార్గెట్‌ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?

  5. ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button