
మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:-మర్రిగూడ మండలం తాజా మాజీ ఎంపీపీ గండికోట రాజమణి హరికృష్ణ, బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో, కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి గండికోటను ఆహ్వానించారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్న ఆయన, ప్రతిపక్ష పార్టీలోకి రావడానికి, స్థానిక నాయకుల పెట్టిన ఇబ్బందే కారణమని చెప్పుకుంటున్నారు. ప్రోటోకాల్, తదితర ముఖ్య అంశాలపై ప్రతినిధ్యం ఇవ్వకపోవడం, ప్రస్తుత అధికార పార్టీ తీరు, నాయకుల పని విధానం నచ్చని కారణంగానే కాంగ్రెస్ ను వీడి, కారు ఎక్కినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటూ జగన్, జిల్లా నాయకులు బచ్చు రామకృష్ణ, రామిడి వెంకటరమణారెడ్డి, తమ్మడపల్లి మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహ, పిఎసిఎస్ డైరెక్టర్ మేకల గోవర్ధన్, యంజాల యాదగిరి, చెల్లం వెంకటేష్, జిల్లా శివ తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణంలో ఉన్న రాళ్లవాగు వంతెన.. ఉదృత వలన కొట్టుకుపోయిన తాత్కాలిక దారి