
-
సోషల్ మీడియాలో వైరలవుతున్న హిడ్మా లేఖ
-
హిడ్మా లేఖ గురించి తెలియదంటున్న పోలీసులు
-
సంచలనం రేపుతోన్న హిడ్మా లేఖలోని అంశాలు
-
మావోయిస్టు నేతలు సోను, సతీష్ అవకాశవాదులని ఆరోపణ
-
సోను, సతీష్ క్యాడర్‌ను మోసం చేశారని హిడ్మా ఆగ్రహం
-
మావోయిస్టు పార్టీ లైన్‌ను వక్రీకరించి ప్రజలకు చూపారని మండిపాటు
-
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలను వదిలేదన్న హిడ్మా
-
లొంగిపోయిన మావోయిస్టులు పునరాలోచించాలని హితవు
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: మంగళవారం రోజున జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా రాసిన చివరి లేఖ సంచలనంగా మారింది. హిడ్మా రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
హిడ్మా రాసిన లేఖలోని పలు అంశాలు సంచలనంగా మారాయి. మావోయిస్టు నేతలు సోను, సతీష్ లొంగిపోయాకే ఉద్యమానికి తీవ్ర నష్టం చేకూరిందన్నారు హిడ్మా. సోను, సతీష్ అవకాశవాదులని హిడ్మా ఆరోపించారు. క్యాడర్‌ను మోసం చేసి, పోలీసుల ఎదుట లొంగిపోయేలా చేశారని ఆయన మండిపడ్డారు. ఇదే కాకుండా మావోయిస్టు పార్టీ లైన్‌ను ప్రజలకు వక్రీకరించి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తాము నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని హిడ్మా లేఖలో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధాలను వీడబోమని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు పునరాలోచించాలని లేఖలో సూచించారు హిడ్మా. కాగా, హిడ్మా పేరుతో వైరలవుతున్న లేఖ విషయం తమకు తెలియదంటున్నారు అధికారులు.
Read Also:





