
ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు బీసు లక్ష్మమ్మ-నర్సయ్య గౌడ్ జ్ఞాపకార్ధం వారి కోడలు-కుమారులు స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి-చందర్ గౌడ్ ఆర్థిక సాయంతో నిర్వహించే సంక్రాంతి మండల స్థాయి క్రీడోత్సవాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ క్రీడోత్సవాల్లో భాగంగా మొదటి రోజు తేదీ:14-01-2026 భోగి నాడు ఆత్మకూరు(ఎం)గ్రామ మహిళలందరికి ముగ్గుల పోటీలు కలవని పోటీలో గెలుపొందిన వారికీ మొదటి బహుమతిగా 5016 రూ +షిల్డ్,రెండవ బహుమతి 4016 రూ+షీల్డ్, మూడవ బహుమతి 3016 రూ +షీల్డ్,నాల్గవ బహుమతి 2016+షీల్డ్ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సహక బహుమతి ఇవ్వబడం జరుగుతుంది.అలాగే రసాకసి, కుర్చీ ఆటలు కూడా ఉన్నాయి. రెండవ రోజు మరియు మూడవ రోజు మండల స్థాయి కబడ్డీ పోటీలు కలవని దీనిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 10016/-+షీల్డ్ రెండవ బహుమతి 6016/-+షీల్డ్ కలవు మరియు గ్రామీణ స్థాయిలో వాలీబాల్ పోటీలు కలవు దీంట్లో మొదటి బహుమతి గా 3016/-+షీల్డ్ రెండవ బహుమతి గా 1516/- +షీల్డ్,చెస్ మొదటి బహుమతి 1016/-+షీల్డ్, రెండవ బహుమతి 516/-+ షీల్డ్ క్యారం బోర్డ్ మొదటి బహుమతి 1016/-+షీల్డ్ రెండవ బహుమతి 516/-+ షీల్డ్ కలవు.
ఈ సందర్భంగా యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన మురళి కృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కనుమరుగవుతున్న క్రీడలను వెలికి తీయాలని ఉద్దేశంతో నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఇట్టి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఆత్మకూరు(ఎం)మండల మరియు గ్రామ ప్రజాప్రతినిధులు క్రీడాకారులు క్రీడాభిమానులు, ప్రజలు పాల్గొని ఈ మండల స్థాయి క్రీడోత్సవాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి యాస మహేందర్ రెడ్డి ,స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్,ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్, మాజీ సర్పంచ్లు జన్నాయికోడే నగేష్,యాస లక్ష్మారెడ్డి,మాజీ ఎంపీటీసీ యాస కవిత ఇంద్రారెడ్డి,జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మహదేవ రెడ్డి,అఖిల పక్ష నాయకులు కోరే బిక్షపతి,బొబ్బల ఇంద్రారెడ్డి, గజరాజు కాశీనాథ్,బండారు సత్యనారాయణ,లోడి వెంకటయ్య,శ్రీశైలం,పరకాల నరసయ్య,మాజీ అధ్యక్షులు పోతగాని మల్లేష్,దొంతరబోయిన భాస్కర్,ప్రతికంఠం శంతన్ రాజు, వార్డు సభ్యులు బూడిద శేఖర్, రాగటి మత్యగిరి,గడ్డం సతీష్, గట్టు విశాల్, పైళ్ల ప్రసన్న,నేతాజీ యువజన మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.





