HomeజాతీయంOwaisi vs Mamata: దీదీని వణికిస్తున్న ఓవైసీ.. టిఎంసి శ్రేణుల్లో కలవరం!

Owaisi vs Mamata: దీదీని వణికిస్తున్న ఓవైసీ.. టిఎంసి శ్రేణుల్లో కలవరం!

* పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం పోటీ

* స్థానిక నేత హుమయున్ కబీర్ పార్టీతో పొత్తు

* పదుల సంఖ్యలో నియోజకవర్గాలపై ప్రభావం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎన్నికల పోరు మహాసంగ్రామాన్ని తలపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సైతం పట్టు సడలకుండా చూసుకుంటున్నారు. చాలావరకు సర్వేలు టిఎంసీ కి అనుకూల ఫలితాలు ఇస్తున్నాయి. మరి కొన్ని సర్వేలు మాత్రం బిజెపికి అనుకూలం అని చెబుతున్నాయి. అయితే గెలుపు ఓటములను నిర్దేశించేది మాత్రం ముస్లిం మైనారిటీలు. ఇప్పటివరకు ఆ వర్గాలన్నీ మమతా బెనర్జీకి అండగా ఉండేవి. సహజంగానే బిజెపి పై హిందుత్వముద్ర ఉండడంతో మైనార్టీ ఓటు బ్యాంక్ అంత మమతా బెనర్జీ కొల్లగొట్టేవారు. కానీ ఇప్పుడు ఓవైసీ ప్రవేశంతో పూర్తిగా సీన్ మారుతోంది బెంగాల్లో. మజ్లిస్ ఈ ఎన్నికల్లో బెంగాల్లో బరిలో దిగుతోంది. స్థానిక ముస్లిం నేత హుమాయాన్  కబీర్ పెట్టిన పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. ముస్లింల ఓటు బ్యాంకు ను గణనీయంగా పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే మమతా బెనర్జీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయం.

ఆది నుంచి టీఎంసీ కి అండ..

గతంలో రెండు సార్లు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంక్. వామపక్షాల బలం తగ్గిన తర్వాత ఆ రెండు వర్గాల ఓటు బ్యాంకు సొంతం చేసుకున్నారు మమతా బెనర్జీ. కానీ ఎన్నికల్లో మాత్రం అది కుదిరే పని కాదన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు టీఎంసీ ఓటు బ్యాంకుగా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు అసదుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగారు. తన ఎంఐఎం పార్టీని స్థానిక ముస్లిం నేత హుమాయున్ కబీర్ స్థాపించిన భారతీయ రిజర్వ్ పార్టీతో జత కలిపి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది బెంగాల్ రాజకీయాల్లోనే కీలక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కలయిక కచ్చితంగా మమతా బెనర్జీకి ఇబ్బందికరమని తేల్చి చెబుతున్నారు. కచ్చితంగా అధికార పార్టీగా ఉన్న టీఎంసీ కి ఇది ప్రతికూల అంశంగా అభివర్ణిస్తున్నారు.

బెంగాల్లో ముస్లింలు అధికం..

పశ్చిమ బెంగాల్ జనాభాలో సుమారు 30 శాతం ఉంటారు ముస్లిం ఓటర్లు. ఇప్పటివరకు వారు మమతా బెనర్జీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు హైదరాబాది లీడర్ ఓవైసీ.. బెంగాల్ నాయకుడు హుమాయున్ కబీర్ తో చేతులు కలపడం తమకు నష్టమని టిఎంసి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ప్రధానంగా మూల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినజ్పూర్ వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాల్లో ఈ కొత్త కూటమి పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వాస్తవానికి కబీర్ గతంలో టీఎంసీ లోనే పనిచేశారు. మమతా బెనర్జీ పార్టీలోనే కీలక నేతగా ఎదిగారు. అయితే మమతా బెనర్జీ తీరును నిరసిస్తూ అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. తాను ఒంటరిగా వెళ్లడం కంటే ఓవైసీ తో చేతులు కలిపితేనే మమతా బెనర్జీకి చెక్ చెప్పవచ్చని కబీర్ భావిస్తున్నారు. అయితే ఈ కొత్త కలయికతో ముస్లిం ఓట్లు చిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీకి రాజకీయంగా ఇది పెద్ద గండంగా మారింది.

వాగ్దాటితో ఓవైసీ..

ఉత్తరాది రాష్ట్రాల్లోని ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎంఐఎం గట్టిగానే ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఓవైసీ జాతీయ స్థాయిలో సైతం ముస్లింలలో ప్రభావం చూపగల నేత. అందుకే కబీర్ టీఎంసీ నుంచి బయటకు వచ్చి ఓవైసీ తో చేతులు కలిపారు. ఈ పరిణామం మమతా బెనర్జీకి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే ఇప్పుడు ఓవైసీ ని టార్గెట్ చేస్తున్నారు మమతా బెనర్జీ. బిజెపికి బీటింగా అభివర్ణిస్తున్నారు. అయితే గతంలో ఎంఐఎం ను హైదరాబాద్ పార్టీగా కొట్టి పారేశారు దీదీ. కానీ ఇప్పుడు అదే పార్టీతో తనకు ఇబ్బందికర పరిస్థితులు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పొత్తు వల్ల కనీసం పది నుంచి పదిహేను శాతం ముస్లిం ఓట్లు చీలిపోతే.. పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు తారుమారు అవుతాయని భావిస్తున్నారు. పైగా ఓవైసీ ఇప్పుడు ముస్లింలను ఓటు బ్యాంకు గానే చూసుకుంటున్నారని.. అందుకే మనమే సొంతంగా గెలిస్తే ప్రభుత్వాలను నిర్ధారించుకోవచ్చు అని ఇస్తున్న పిలుపు ముస్లింలను ఆకర్షిస్తోంది. ఓవైసీ తనదైన శైలిలో వాగ్దాటితో ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఫలితంగా మమతా బెనర్జీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన కలవరం నెలకొంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments