క్రైమ్

పూజారి వేధించాడు.. మలేషియా మోడల్ ఆరోపణలు!

Malaysian Model Lishalliny Kanaran: ఓ భారతీయ పూజారి తనను అసభ్యకర రీతిలో వేధింపులకు గురి చేసినట్లు మ‌లేషియా మోడ‌ల్ లిషాలిని క‌న‌ర‌న్ సంచలన ఆరోపణలు చేసింది. 2021లో మిస్ గ్రాండ్ మ‌లేషియా అవార్డును గెలుచుకున్న ఆమె.. సిపాంగ్‌లో ఉన్న మ‌రియ‌మ్మ‌న్ మందిరానికి వెళ్లింది. అక్కడ ఈ ఘ‌ట‌న జరిగిందని వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. ఓ పూజారి త‌న‌ను అస‌భ్య‌క‌రంగా ముట్టుకున్న‌ట్లు ఆ పోస్టులో వివరించింది. ప‌విత్ర జ‌లాల‌ను చ‌ల్లుతాన‌ని చెప్పి అనుచిత రీతిలో ఆ పూజారి వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోపించింది.

బ్లౌజ్‌ లో పెట్టి అస‌భ్య‌క‌రంగా..

జూన్ 21న ఒంట‌రిగా గుడికి వెళ్లాన‌ని, ఆ స‌మ‌యంలో పూజారి త‌న దగ్గరికి వచ్చి  కాసేపు ఆగ‌మ‌న్నాడ‌ని లిషాలిని తెలపింది. ప్రార్థ‌న‌లు ముగిసిన త‌ర్వాత క‌లుస్తాన‌న్నాడ‌ని చెప్పింది. గంట సేపు వెయిట్ చేసిన తర్వాత త‌ర్వాత ఆ పూజారి వ‌చ్చాడ‌ని, ప్రైవేటు ఆఫీసుకు తీసుకెళ్లి త‌న‌ను వేధించాడ‌ని చెప్పింది. తొలుత ఓ ద్ర‌వాన్ని త‌న‌పై చ‌ల్లాడ‌ని, ఆ త‌ర్వాత త‌న ఛాతిని నిమిరిన‌ట్లు ఆమె త‌న పోస్టులో వెల్లడించింది. త‌న ముందు నిలుచున్న పూజారి.. చేతుల‌ను బ్లౌజ్‌ లో పెట్టి అస‌భ్య‌క‌రంగా ట‌చ్ చేసిన‌ట్లు రోపించింది. ఆ స‌మ‌యంలో తాను షాకైనట్లు వెల్లడించింది. మందిరంలో పూజారి వేధించ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయాన‌ని.. అందుకే ఈ విష‌యాన్ని బయటకు చెప్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సదరు పూజారిపై ఆమె కేసు పెట్టింది. ప్ర‌స్తుతం ఆ పూజారి ప‌రారీలో ఉన్నాడు. అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: ఎమర్జెన్సీ మాయని మచ్చ, కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button