
క్రైమ్ మిర్రర్, పటాన్ చెరు ప్రతినిధి : –
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజక వర్గం గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలోని తిరుమల ఆయిల్చెం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పేపర్ డివిజన్) పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పరిశ్రమలోని పేపర్ మెటీరియల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడుగంటల పాటు మంటలు ఎగిసిపడ్డాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహాయంతో నీటి ట్యాంకర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ భద్రతాపరమైన ప్రమాణాలు పాటించలేదనే ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తయి వివరాలు తెలియాల్సి ఉంది.
రేవంత్ అమ్మిన భూమిని కొనవద్దు.. మేం తిరిగి లాగేసుకుంటం