* పునర్విభజన ప్రక్రియను మొదలు పెట్టనున్న కేంద్రం
* ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు
* ఎన్డీఏ సమావేశాల్లో కీలక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. నియోజకవర్గాల పునర్విభజనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఈ మేరకు ఈ ప్రక్రియ ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో స్పష్టతనిచ్చింది. 2029 నాటికి అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను 50% పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి అవకాశం కనిపిస్తోంది.. ఒకవేళ నియోజకవర్గాల పెంపు జరిగితే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263 కు.. పార్లమెంటు స్థానాలు 38కు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే జరిగితే రాజకీయ ఆశవహులకు చక్కటి అవకాశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పోటీ చేసేందుకు వందలాదిమందికి ఛాన్స్ దక్కనుంది అన్నమాట.
విభజన చట్టంలో..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు అంశం ఉంది. పునర్విభజన చేపట్టి నియోజకవర్గాలను పెంచనున్నట్లు విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ వివిధ కారణాలతో ఆ ప్రక్రియ జరపలేదు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 534 లోక్సభ స్థానాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో 816 లోక్సభ సీట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 4,123 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటి సంఖ్య 6185 కు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఏపీలో ఇలా..
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలు కొనసాగుతున్నాయి. పునర్విభజనతో అసెంబ్లీ సీట్లు 263 కు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. పార్లమెంట్ సీట్లు 37 నుంచి 38 వరకు పెరగనున్నాయి. అంటే అసెంబ్లీ స్థానాలు 83, పార్లమెంట్ సీట్లు ఓ 13 పెరగనున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కూటమికి ఎంతో ప్రయోజనకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనేది అధికార పార్టీకి అనుకూలం. ప్రతిపక్షాలకు చెందిన బలమైన నియోజకవర్గాలను విభజించి ఎక్కువగా లాభం పొందుతుంది అధికార పార్టీ. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉంది. తాజా లెక్కల ప్రకారం కొత్తగా ఓ 100 మంది వరకు అవకాశం చిక్కనుంది. ఇప్పటికే కూటమి పార్టీలో నేతలు ఉన్నారు. వారందరికీ ఒక అవకాశం చిక్కే ఛాన్స్ ఉంటుంది.
తెలంగాణలో ఇలా..
తెలంగాణ విషయానికి వచ్చేసరికి 117 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. పునర్ విభజనతో అసెంబ్లీ స్థానాలు 179కి, పార్లమెంట్ సీట్లు 16 కు పెరిగే అవకాశాలు ఉన్నాయి. శాసనసభ స్థానాలు 60, లోక్సభ స్థానాలు 9 పెరుగుతాయని అంచనా. అంటే అదనంగా ఆశావహులకు ఛాన్స్ దక్కినట్టే. ప్రస్తుతం తెలంగాణలో త్రిముఖ పోరు ఉంది. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బిజెపి వర్సెస్ బి ఆర్ ఎస్ గట్టిగానే తలపడుతున్నాయి. అయితే బిజెపితో గులాబీ పార్టీ పొత్తు ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఆ రెండు పార్టీలు కలిస్తే కాంగ్రెస్కు నష్టం. అయితే నియోజకవర్గాల పెంపుతో ఆ రెండు పార్టీలు కలిస్తే ఎంతో ప్రయోజనం. అయితే బిజెపి ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?
