
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ‘మహవుతార్ నరసింహ’ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. హోంబలే ఫిలిమ్స్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులను నమోదు చేస్తుంది. తాజాగా ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏకంగా 105 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలపడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. మొదటి రెండు మూడు రోజుల్లో తక్కువ వసూళ్లు వచ్చినా కూడా.. మెల్లిమెల్లిగా మంచి టాక్ రావడంతో ఏకంగా 100 కోట్ల గ్రాస్ ను దాటింది. యానిమేషన్ తో వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక వసూలు రాబెట్టిన యానిమేషన్ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. జులై 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు కూడా థియేటర్స్ ఫుల్ టాక్ వినిపిస్తుంది. థియేటర్స్ కి పెద్ద ఎత్తున జనం క్యూ కడుతున్నారు.
Read also : చెరువు భూమి కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేయాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సాధారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ బాగుంది అని తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్లి మరీ చూస్తారు. అందులోనూ దేవుడి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు కామ్ గా ఉంటారా?.. దీంతో సినిమా ధియేటర్లోనే భక్తి భావాన్ని కలగ చేస్తున్నారు. థియేటర్ల బయటే చెప్పులు విడిచి.. థియేటర్ లోపల ఇష్టమైన నరసింహావతారాన్ని చూసి భజనలు చేస్తున్నారు. సామాన్యంగానే మన తెలుగు ప్రేక్షకులు తక్కువ బడ్జెట్ అయినా కూడా మంచి సినిమా అని తెలిస్తే ఫ్యామిలీతో సహా థియేటర్లకు వెళుతూ ఉంటారు. ఈ సంవత్సరం యానిమేటెడ్ తో వచ్చిన ఈ సినిమా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలోని విజువల్స్ అలాగే నరసింహస్వామి అవతారం చాలా అద్భుతంగా ఉంది అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు కదా కావాల్సింది అని సినిమాని అలాగే చిత్ర బృందాన్ని కూడా తెగ ప్రశంసిస్తున్నారు.
Read also : నీలకంఠ రామస్వామి రక్షణకు శాశ్వత రోడ్డు, బ్రిడ్జ్ నిర్మాణానికి హామీ – ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి