జాతీయం

గాంధీ మనువరాలికి ఏడేళ్ల జైలు శిక్ష.. వామ్మో ఇంత మోసమా?

Ashish Lata Ramgobin: బతికినంత కాలం దేశం కోసం పోరాడిన మహాత్మా గాంధీ పేరు చెడగొడుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తాజాగా ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో గాంధీ మునిమనుమరాలు ఆషిష్‌ లత రామ్‌ గోబిన్‌(56)కు  ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రముఖ హక్కుల కార్యకర్త ఇలా గాంధీ, దివంగత మెవా రామ్‌ గోబిన్‌ బిడ్డ అయిన లత.. వ్యాపారవేత్త ఎస్‌ ఆర్‌ మహరాజ్‌ ను 3.22 కోట్లకు మోసం చేసింది. నేరం నిజమేనని తేలడంతో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్‌ కోర్టు శిక్ష ఖరారు చేసింది. అంతేకాదు, అప్పీలు చేసుకునే అవకాశాన్నీ కూడా నిరాకరించింది.

హక్కుల కార్యకర్త అని చెప్పుకుంటూ మోసాలు

తనకు తాను ఆహింసావాదిగా, హక్కుల కార్యకర్తగా చెప్పుకునే లత రామ్‌ గోబిన్‌ మోసాలకు పాల్పడుతుందని తెలియడంతో అందరూ షాకయ్యారు. లత 2015లో వ్యాపారవేత్త ఎస్‌ఆర్‌ మహరాజ్‌ ను కలిసింది. ఆయన డర్బన్ లో దుస్తులు, చెప్పుల వ్యాపారంలో రాణిస్తున్నారు. ఇతర వ్యాపారవేత్తలకు అవసమైన ఆర్థిక సాయం చేస్తూ, లాభంలో వాటా తీసుకుంటారు. అలా లత కూడా అతడి నుంచి సాయం తీసుకుంది. సౌతాఫ్రికాలోని ఓ హాస్పిటల్ గ్రూప్ నకు అవసరమైన లైనిన్‌ ను ఇండియా నుంచి దిగుమతి చేసుకున్నట్లు చెప్పింది. కస్టమ్స్‌, ఇంపోర్ట్ టాక్సెస్ చెల్లించాని చెప్పింది. అయితే, ప్రస్తుతం తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పింది. తనకు ఆర్థిక సాయం చేస్తే, లాభాల్లో వాటా ఇస్తానని ఆమె చెప్పింది. ఆమె మాటను నమ్మి మహరాజ్‌ నిధులు సమకూర్చాడు. కొద్ది రోజుల్లోనే ఆమె తనను మోసం చేసిందని మహరాజ్ తెలుసుకున్నాడు. అసలు ఆమె ఇండియా నుంచి ఎలాంటి వస్తువులను ఇంపోర్ట్ చేసుకోలేదని గుర్తించాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది.

Read Also: కాసేపట్లో పోస్టుమార్టం, ఇంతలో అసలు యువకుడు ప్రత్యక్షం!

Back to top button