క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్కు మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇకపై ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. కాగా రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులు జూనియర్ కళాశాలలో చేరడంతో వారికి ఎటువంటి ఆహారపరంగా నష్టం కలగకూడదని ఇలా చేసినట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
గేమ్ చేంజెర్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!… ట్రైలర్ ఎప్పుడంటే?
దారిద్య రేఖకు దిగువన ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త సంవత్సరం ను పురస్కరించుకొని నేటి నుంచి దాదాపుగా 475 జూనియర్ కళాశాలల్లొ ఈ మధ్యాహ్న భోజన పథకం ను అమలు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
క్రైమ్ మిర్రర్ న్యూస్ తరుపున అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు..!
కాగా ఇప్పటికే ఈ మధ్యాహ్న భోజన పథకం కింద ఏకంగా 115 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి సర్కార్ కేటాయించింది. తాజాగా వీటిని అమలు చేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ మధ్యాహ్న భోజన పథకం అమలుపట్ల చాలామంది విద్యార్థులు మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఈ పథకం పై ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే మిగిలిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. అప్పటివరకు అరెస్టు చేయొద్దు!!
తాగి రోడెక్కారో అంతే సంగతి.. తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ!!