
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇదిలా ఉండగా… వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరికలు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉంది అని వాతావరణ శాఖ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లుగా సమాచారం అందింది. ఈ అల్పపీడనం కొద్ది రోజుల్లోనే తుఫానుగా మారే అవకాశం కూడా ఉంది అని అంచనా వేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర మరియు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు రోజులు గడిస్తే కానీ ఈ అల్పపీడనంపై పూర్తి సమాచారం ఇవ్వలేమని… కాబట్టి ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందో లేదో మరొక రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read also : GST ఎఫెక్ట్.. ధరలు తగ్గిస్తున్నట్లు డెయిరీ లు ప్రకటన!
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలు నీట మునిగాయి. మరియు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు నగరంలో డ్రైనేజీ సిస్టం సరిగా లేక రోడ్లపైనే నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా… రైతులు కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ ఏడాది నీటికి కరువు లేదనుకొని చాలామంది చాలా రకాల పంటల నాట్లు వేశారు. కానీ వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని పంటలు దెబ్బతినగా… రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సిటీలలో బయటకు అడుగు పెట్టాలన్న ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈసారి వర్షాలు విరుచుకు పడుతున్నాయి. దీంతో చాలా రకాలుగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పడినటువంటి వర్షాలకు జల ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ పూర్తిగా నిండగా.. మరికొన్ని చెరువులు, నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అల్పపీడనం తుఫానుగా మారితే .. వర్ష ప్రభావం అనేది మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Read also : పనికిరాని వాళ్ళు వద్దంట… భారత్ ను కావాలనే అవమానిస్తున్నారా?