
ఆంధ్రప్రదేశ్, క్రైమ్ మిర్రర్ :- ఏపీ లో త్వరలోనే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది అని తాజాగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్ర పరిసరాలలో ఏర్పడిన ఈ అల్పపీడనం రేపటికి వాయుగుండం గా మారుతుంది అని స్పష్టం చేశారు. దీని ప్రభావం కారణంగా ఈ నెల 30వ తేదీ నాటికి ఈ వాయుగుండం తుఫానుగా మారి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు ఆస్కారం ఉంది అని మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ తుఫాను ముప్పు కేవలం ఉత్తర కోస్తాకు మాత్రమే ఉంటుంది అని.. ఈనెల 28వ తేదీ నుంచి కూడా వర్షాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని ప్రకటించారు. ఇక ఇవ్వాలా మరియు రేపు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA కీలక ప్రకటన విడుదల చేసింది. కాగా ఇప్పటికే మొంథా తుఫాన్ కారణంగా ప్రజలందరూ ఎంతలా ఇబ్బందులను ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలే చలికాలంలో ఇలాంటి వర్షాలు పడడం వల్ల ప్రజలు మరింత అనారోగ్యం పాలవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వర్షాలు పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతున్నారు.
Read also : వామ్మో.. అంబానీ స్కూల్ లో ఫీజులు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Read also : గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి : సీఎం





