
-
అల్పపీడనం రేపటివరకు మరింత బలపడే అవకాశం
-
ఒడిశా మీదుగా పశ్చిమవాయువ్య దిశగా పయనం
-
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్
-
సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు ఆదేశాలు
-
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
క్రైమ్‌మిర్రర్, అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటివరకు అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వానలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉంది. దీని కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండి, తీరం వెంబడి తీవ్రమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Read Also: