
Heavy Rainfall Alert For AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది గురువారం నాటికి పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో పలు ప్రాంతాల్లో వానలు
అల్పపీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. అల్పపీడనం కోస్తాకు ఆనుకుని బంగాళాఖాతంలో కొనసాగుతున్నందున ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతిభారీ, కొన్నిచోట్ల అసాధారణ వర్షాలు, పశ్చిమగోదావరి, ఏల్లూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీ సర్కారు కీలక ఆదేశాలు
అల్పపీడనం నేపథ్యంలో వర్షప్రభావిత ప్రాంత ప్రజలకు ఏపీ సర్కారు కీలక సూచనలు చేసింది. అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. భారీ వర్షాలు సంభవిస్తే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించింది.
Read Also: భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు