
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో గులాబీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ అనేది తగిలింది. జిమ్లు తీవ్రంగా గాయపడిన కేటీఆర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా నుంచి చాలామంది రాజకీయ నాయకులు అలాగే సామాన్య ప్రజల నుంచి కామెంట్లు వస్తున్నాయి. వీళ్ళతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా స్పందించారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కలవకుంట్ల తారక రామారావు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా నాయకులు ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు తన మిత్రుడు.. గులాబ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు త్వరగా కోలుకోవాలని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పేర్కొన్నారు.
కేటీఆర్ ఎప్పుడైతే నేను జిమ్లో వర్కౌట్ చేస్తుండగా వెన్నుపూస గాయపడినట్లు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో… అప్పటినుండి సోషల్ మీడియా వేదికగా చాలామంది నాయకులు ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి వివరాలను తెలుసుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి కెసిఆర్ సభకు చాలా చక్కగా వచ్చి కేటీఆర్ చాలా బాగా పార్టీ గురించి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఒకరోజు గొడవకు ముందే కేటీఆర్ జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో తమ నాయకుడికి ఏమైంది అని ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్ లొ కింగ్ ఫిషర్ బీర్ల కృతిమ కొరత..బెల్టు షాపుల్లో ఫుల్ స్టాక్..! వైన్ షాపుల్లో నో స్టాక్.
అచ్చెన్నాయుడి రాజకీయ భవిష్యత్ ఏంటి..? – ఆయన తప్పుకుని వారసుడిని దింపుతారా..!