
-
తెలంగాణ జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకం
-
10 ఉమ్మడి జిల్లాలకు 10మంది ఐఏఎస్‌లు
-
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక పరిణామం
-
ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై పర్యవేక్షణ
-
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు 10మంది ఐఏఎస్‌లను స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్- సి.హరికిరణ్, నల్గొండ- అనితారామచంద్రన్, హైదరాబాద్- ఇలంబర్తి, ఖమ్మం- సురేంద్రమోహన్, నిజామాబాద్-రాజీవ్‌గాంధీ హన్మంతు, రంగారెడ్డి- దివ్య, కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్, మహబూబ్‌నగర్- రవి, వరంగల్-కె.శశాంక, మెదక్ జిల్లాకు ఎ.శరత్‌ను ప్రభుత్వం నియమించింది.
ప్రత్యేకాధికారులందరూ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతీరును పర్యవేక్షించనున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు. అలాగే భారీ వర్షాలు, వరదలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షించించి, అవసరమైన చర్యలను తీసుకోనున్నారు.
Read Also: