
-
స్థానిక ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
-
ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ
-
రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కాగా, సుమారు రెండేళ్లుగా గ్రామాల్లో పాలకవర్గాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వంపై హైకోర్టులోనూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సైతం ప్రభుత్వానికి ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే.
Read Also: