
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. జులైలో ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ ఆలోచనలో వుందని తెలుస్తోంది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు ఎన్నికలకు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే అంశంపై సంబంధిత అధికారులతో చర్చిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం చొప్పున రిజర్వేషన్లను అమలు చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకుగాను సర్కార్ బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరోవైపు పార్లమెంటు సమామేశాలు శుక్రవారంతో ముగిశాయి. దీంతో వర్షాకాల సమావేశాల వరకూ ప్రభుత్వం ఎదురుచూడాల్సి వుంటుంది. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read : మల్లీ అదే పొరపాటు చేస్తుందా తెలంగాణ ప్రభుత్వం..!?
2024 జనవరిలో సర్పంచుల పదవి కాలం ముగిసింది. 15 నెలలుగా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. అటు గత జూలైతో ఎంపీటీసీ,జడ్పీటీసీల పదవి కాలం ముగిసింది. 6 నెలల క్రితం మున్సిపల్ చైర్మెన్ల పదవి అయిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో మాత్రం పాలకమండళ్లు ఉన్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోవడంతో పాలన కుంటుపడిందనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో అనేక సమస్యలు కనిపిస్తున్నాయి.