
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయని తాతలు సామెతలు చెప్పేది, ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే, ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. వేసవికాలం వస్తోందంటే ఎవరికైనా గుండెలు గుబగుబలాడటం కద్దు. ఒకవైపు మండే ఎండలు… మరొక వైపు గొంతెండిపోతున్నా దొరకని గుక్కెడు నీళ్లు! ఎప్పుడూ ఉండే ఈ దురవస్థకి తోడు ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయంటూ వినవస్తున్న వివిధ వాతావరణ సర్వేల హెచ్చరికలు బేజారెత్తిస్తున్నాయి. ఇది నిజమేనంటూ ఫిబ్రవరి నెల నుంచే సూర్య ప్రతాపం మొదలైంది. మార్చి నెల సగమైనా గడవక ముందే వాతావరణం మండువేసవిని తలపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు! గత ఏడాదితో పోల్చితే ఫిబ్రవరి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం మొదలైంది. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ ఏడాది మార్చి- మే నెలల మధ్య వేసవి చండప్రచండంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పని చేసే ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ముందే అంచనా కట్టింది.
బిగ్ బ్రేకింగ్… హత్య కేసులో డీఎస్పీ పై వేటు.
అర్హులైన యువకులకు సువర్ణ అవకాశం:- కాంగ్రెస్ యువ నాయకులు ఓడేటి లచ్చిరెడ్డి