క్రైమ్

భార్యను వదిలి… ట్రాన్స్‌జెండర్‌తో కలిసి…

  • జగిత్యాల జిల్లాలో విచిత్ర సంఘటన

  • భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసిన రాజశేఖర్‌

  • పదేళ్ల క్రితం లాస్యతో రాజశేఖర్‌కు వివాహం

  • కొంతకాలంగా లాస్య, పిల్లలను దూరం పెట్టిన రాజశేఖర్‌

  • హైదరాబాద్‌కు చెందిన హిజ్రా దీపుతో సహజీవనం

  • వీడేం భర్తరా… అంటూ ముక్కున వేలేసుకుంటున్న జనాలు

క్రైమ్‌మిర్రర్‌, కరీంనగర్‌: జగిత్యాల జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు పిల్లల తండ్రి… తన భార్యను వదిలిపెట్టి… ఓ ట్రాన్స్‌జెండర్‌తో కాపురం మొదలుపెట్టడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల పట్టణం భీష్మనగర్‌కు చెందిన రాజశేఖర్‌కు పెంబట్లకు చెందిన లాస్యతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2014 నుంచి భార్య లాస్యతో కాపురం చేస్తూ బాగానే ఉన్నాడు రాజశేఖర్‌.

కాగా, రాజశేఖర్‌ ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చింది. కొంతకాలంగా భార్యను దూరం పెట్టసాగారు. ఏంటా అని ఆరా తీస్తే హైదరాబాద్‌కు చెందిన హిజ్రా దీపుతో రాజశేఖర్‌ సన్నిహితంగా ఉంటున్నాడని భార్యకు తెలిసింది. దీంతో భర్త రాజశేఖర్‌ను లాస్య నిలదీసింది. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించింది.

అయినా రాజశేఖర్‌లో ఎలాంటి మార్పు రాకపోవడంతో లాస్య మానసికంగా కుంగిపోయింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న లాస్య ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఇంత జరిగినా రాజశేఖర్‌ ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడలేదు. భార్య పరిస్థితిపై ఆరా తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన లాస్య తల్లిదండ్రులు రాజశేఖర్‌కోసం వెతికారు. భీష్మనగర్‌లోని ఓ ఇంట్లో హిజ్రాతో కలిసి ఉన్నాడని తెలిసింది. హుటాహుటిన వెళ్లి ఆ ఇంటికి తాళం వేశారు. పోలీసులకు సమాచారం అందించారు. దీపు, రాజశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జగిత్యాల పట్టణంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Read Also: 

  1. ఇకపై బెట్టింగ్‌ యాప్స్‌కి ప్రమోషన్‌ చేయను: ప్రకాశ్‌రాజ్‌
  2. బీసీ రిజర్వేషన్ల బిల్లుల అమలుకు ఢిల్లీలో ఆందోళన, సీఎం రేవంత్‌తో మీనాక్షి భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button