జాతీయం

ఈరోజే అన్ని వదిలేసేయ్.. GOOD BYE 2025

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- 2025 అనే సంవత్సరం ఈరోజుతో ముగియనుంది. ఇక రేపటి నుంచి నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాలు లోతుగా పరిశీలించుకోవాలి. ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వాటన్నిటిని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. నూతన సంవత్సరం కాబట్టి మన జీవితాలు కూడా నూతనంగా ప్రారంభించాలి అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఎంతోమంది చాలా బద్ధకం, కోపం, సహనం లేకపోవడం, నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేకపోవడం, అతిగా ఆలోచించడం వంటివి మార్చుకోవాలి. ఎన్నో సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్న వాటన్నిటిని కూడా దాటుకుని ముందడుగు వేయాలి. గతంలో మీ జీవితం ఒకలా ఉన్నా దానిని ఈరోజు నుంచి మరోలా మార్చుకోండి.

Read also : వేములపల్లి పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్… 15 మందిపై కేసు నమోదు

ఈరోజుటితో ఈ ఏడాది ముగుస్తున్నది కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని మీ బలహీనతలు అన్నిటిని కూడా వదిలేసుకుని రేపు ప్రారంభం అయ్యేటువంటి నవవసంతంలోకి కొత్తగా అడుగు పెట్టండి. మీతో పాటు మీ స్నేహితులకు కూడా కొత్త జీవితాన్ని అందించడానికి మీ వంతు కృషి చేయండి. ప్రతిరోజు సోషల్ మీడియా అంటూ కాలాన్ని గడుపుతున్న యువకులు ఈరోజుల్లో ఎంతోమంది ఉన్నారు. ఎదిగిన వారు కొంతమంది తమ స్వార్థం చూసుకొని.. మిగిలిన వారిని పైకి తీసుకురావడానికి మాత్రం సానుభూతి చూపించడం లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరి జీవితం వారిదే అని చెప్పాలి. పక్కనోడి నీ పట్టించుకోవడం పక్కన పెడితే.. కనీసం పక్కనోడితో మాట్లాడడానికి కూడా ఈ రోజుల్లో డబ్బులు ఉన్న వ్యక్తులకు నోరు రావడం లేదు. కేవలం డబ్బుతో అన్ని కొనొచ్చు అంటే మాత్రం అది ముమ్మాటికీ తప్పే. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు శాశ్వతం కాదు. ఏవైతే పంచభూతాలు ఉన్నాయో అవే శాశ్వతం. కాబట్టి ప్రకృతిని కూడా కాపాడుకుంటూ ముందుకు గడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాల్టి వరకు మీరు ఎలా ఉన్నా కూడా రేపటి నుంచి మారడానికి ట్రై ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మా క్రైమ్ మిర్రర్ న్యూస్ వెబ్సైట్ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button