
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- సుప్రీంకోర్టులో ప్రధాన్ న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయి పై దాడి జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ ఘటనపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. మా దేశం వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయులపై దాడి చేసి భయపెట్టే ఈ నీచమైన ప్రయత్నాన్ని ఖండించడానికి నాకు మాటలు సరిపోవట్లేదు. ఇది మన దేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా ఉంటుంది అంటూ… ఇలాంటి పిరికిపంద దాడులతో తాను వెనక్కి తగ్గబోనని ధైర్యంగా ప్రకటించిన మన అజేయమైన భారత ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయి తో నేను అలాగే ఈ దేశ పౌరులు అందరూ మద్దతుగా ఉన్నామంటూ భరోసా ఇచ్చారు.
Read also : ఏపీ 2029 లో ఈ పార్టీదే అధికారం?.. గత రికార్డులే సాక్ష్యం!
కాగా ఓ కేసు విచారణ సందర్భంగా వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక లాయర్ ఏకంగా జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తన షూ ను తీసి సిజెపై విసిరేందుకు చూడగా.. వెంటనే పక్కన ఉన్నటువంటి భద్రత సిబ్బంది అలాగే తోటి లాయర్లు అప్రమత్తమై అతనిని అడ్డుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ దాడి సంచలనం సృష్టిస్తుంది. అత్యున్నత స్థానంలో ఉన్న బీఆర్ గవాయిపై జరిగిన దాడిని చూసి ప్రజలు కూడా ఒకింత షాక్ కు గురయ్యారు. ఇప్పటికే ఈ ఘటనపై పలు పార్టీ నేతలు అలాగే ప్రముఖ వ్యక్తులు స్పందిస్తూ ఈ ఘటనను ఖండించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటన హైలైట్ గా నిలిచింది.
Read also : హెచ్ఎండీఏ కార్యాలయం ముందు ట్రిపుల్ ఆర్ రైతుల మహా ధర్నా