తెలంగాణ

తెలంగాణ లేటెస్ట్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

తెలంగాణ ఎమ్మెల్యేల ప‌నితీరుపై లేటెస్ట్ గా నిర్వహించిన ఫలితాల్లో సంచలన ఫలితాలు వచ్చాయి. 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టాప్ ప్లేస్ లో నిలిచారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఆయన క్రాస్ చేశారు. ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశంపై మాత్రమే నిర్వహించిన ఈ సర్వేలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని మినహాయించారు.

ఈ జాబితాలో కేసీఆర్ రెండో స్థానంలో ఉండగా.. మంత్రి శ్రీధర్ బాబు మూడో స్థానంలో నిలిచారు.కేటీఆర్ కు ఏడో స్థానంలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి టాప్ టెన్ గా నిలిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో టాప్ లో మంత్రి శ్రీధర్ బాబు ఉండగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వ స్థానంలో నిలిచారు. మంత్రి సీతక్కకు నాలుగో స్థానం దక్కింది.మహిళా ఎమ్మెల్యేలలో మంత్రి సీతక్కను క్రాస్ చేసి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టాప్ ప్లేస్ లో నిలిచారు.


Also Read : ఎన్టీఆర్ వద్దన్నా… చాలా మొండిగా ఆ సినిమా తీశాను: మోహన్ బాబు 


సర్వే ప్రకారం మొత్తం 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది.అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురు పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో.. 12 మంది పనితీరు బాగుందని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో స్పష్టమైంది. బీజేపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఒక ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. ఎంఐంఎం ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని.. ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సీపీఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.

ఇవి కూడా చదవండి ..

  1. ఏపీ సచివాలయంలోని పవన్ కల్యాణ్ బ్లాక్ లో మంటలు

  2. అకడమిక్ క్యాలెండర్ విడుదల… సెలవులు దినాలు ఎప్పుడంటే?..

  3. హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్.. మునిగిపోవడం ఖాయమా?

  4. సభలోనే తెలంగాణ మంత్రిని బూతులు తిట్టిన మహిళలు

  5. ప్రియునితో కలిసి.. కట్టుకున్న మొగున్నే కాటికి పంపిన భార్య..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button