
Nimisha Priya Case: యెమన్ లో భారతీయ నర్సు నిమిష ప్రియకు మరికొన్ని గంటలలో ఉరి శిక్ష అమలు కాబోతోంది. బుధవారం నాడు ఆమెను ఉరి తీసేందుకు ఆదేశ జైలు అదికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమెను కాపాడేందుకు భారత ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నం చేసినా, విఫలం అయ్యింది. ఇకపై ప్రభుత్వ పరంగా చేసేది ఏమీ లేదని చేతులు ఎత్తేసింది. కుటుంబం మాత్రం ఆమెను కాపాడుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బాధిత కుటుంబానికి అడిగినంత డబ్బు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. వారు క్షమాభిక్షకు అంగీకరిస్తే నిమిష ఉరిశిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంది.
‘బ్లడ్ మనీ’కి అంగీకరిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం!
నిమిషను కాపాడుకునేందుకు ఇక ఒకే ఒక్క దారి మిగిలింది. బాధిత కుటుంబం అడిగినంత డబ్బులు ఇస్తే, చివరి నిమిషంలో అయినా ఆమె ఉరి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ‘బ్లడ్ మనీ’కి అంగీకరించేలా నిమిష కుటుంబ సభ్యులు బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. నిజానికి కొద్ది నెలల క్రితమే నిమిష ప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద 10 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అయితే, నిమిష కుటుంబానికి, హతుడి కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన లాయర్ హ్యాండిచ్చాడు. తనకు పెద్ద మొత్తంలో ఫీజు ఇస్తేనే చర్చలు జరుపుతానని మొండికేశాడు. ఈ నేపథ్యంలో బ్లడ్ మనీ ప్రక్రియకు బ్రేక్ పడింది.
బాధిత కుటుంబంతో కొనసాగుతున్న చర్చలు
నిమిషకు మరికొద్ది గంటల్లో మరణ శిక్ష అమలు అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె తరఫున శామ్యుయెల్ జెరోమ్, షేక్ హబీబ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. బాధిత కుటుంబానికి నిమిష ఫ్యామిలీ 10 లక్షల డాలర్లు వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, మృతుడి కుటుంబం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. ఒకవేళ వాళ్లు బ్లడ్ మనీకి ఒప్పుకుంటే చివరి నిమిషంలో కూడా ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది. తన బిజినెస్ పార్ట్ నర్ ను నిమిష హత్య చేయడంతో ఆమెకు యెమన్ కోర్టు ఉరిశిక్ష విధించింది.
Read Also: మధ్యాహ్నం 3 గంటలకు.. ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగనున్న శుభాన్షు!