
హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. మహిళా వైద్యురాలు పై మరో వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
బంజారాహిల్స్ లోని ప్రముఖ హోటల్ లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేశాడు డాక్టర్ స్వామి. నిలోఫర్ హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తుంది బాధిత మహిళా వైద్యురాలు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు నిందితుడు డాక్టర్ స్వామి. ఈ ఏడాది జనవరి లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రముఖ హోటల్ కు పిలిచి మహిళా డాక్టర్ పై లైంగిక దాడి చేశాడు డాక్టర్ స్వామి
పెళ్లి పేరుతో డాక్టర్ పై పలుమార్లు లైంగిక దాడి చేసిన నిందితుడు… కొన్ని రోజలుగా పెళ్లి కి నిరాకరిస్తున్నాడు. దీంతో తనను మోసం చేసిన డాక్టర్ స్వామి పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళా వైద్యురాలు