
Mlas Defection Case: కొంత మంది ప్రజా ప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాని భారత ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతినదని దేశ సుప్రీంకోర్టు రుజువు చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేల కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తున్న తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీర్పు ఇచ్చిన సీజేఐకి గవాయ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ధన్య
రాహుల్ కు కేటీఆర్ సవాల్
గత ఎన్నికల సందర్భంగా పాంచ్ న్యాయం పేరుతో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా అనర్హత వర్తించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే మాటకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు 3 నెలల పాటు కష్టపడి పని చేయాలన్నారు. అన్ని స్థానాల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని కేటీఆర్ తేల్చి చెప్పారు. అయితే, పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్‌లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ తీర్పుపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!