తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్పటినుంచి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వమే అండగా నిలవాలని కేటీఆర్ ఇవాళ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు జరిగాయని కేటీఆర్ తెలిపారు.
టీమిండియా పేలవ ప్రదర్శన!… రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?
ఆటో కార్మికులు ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దని, బిఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణమే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే తక్షణమే ఆటో డ్రైవర్ల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు. మరోవైపు శాసనసభలో టిఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. ఇక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా కాఖీ దుస్తులు ధరించి మరీ ఆటోలో శాసనసభకు చేరుకున్నారు.
నారాయణ స్కూల్లో మరో విషాదం!… విద్యార్థి ఆత్మహత్య?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుండి సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే ఆటో డ్రైవర్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలియజేశారు.