
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రంలో నాయకులందరూ కూడా ప్రజల అవసరాలను తీర్చే దారిలో నడవాలని అన్నారు. మంచి మైక్ లో చెప్పాలి అలాగే చెడు చెవిలో ఊదాల్సిన పార్టీ నేతలు రివర్స్ లో చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం పనిచేసే వారికి మరో విడతలో కచ్చితంగా మంచి పదవులు ఇస్తామని తెలిపారు. కష్టపడ్డ వారికి కచ్చితంగా ఫలితం ఏర్పడేలా చూస్తామని అన్నారు. అలాగని కష్టపడకుండా ఉన్న నేతలపై చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ విషయంపై తాజాగా కేటీఆర్ స్పందించారు. మైక్ లో చెప్పడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మంచి చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన చెడు చాలానే ఉన్నాయని అన్నారు. ఆర్ ఆర్ టాక్స్, నీళ్లు ఘటన వంటి విషయాలు చెప్తే చెవుల నుంచి రక్తాలు వస్తాయని చురకలు వంటించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ లో చేరికల సందర్భంగా ఆయన ఈ విషయాలు మాట్లాడారు. ఒకప్పుడు చంద్రబాబు కోసం మళ్లీ ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నారని సెటైర్లు వేశారు. ఈ విషయాన్ని పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి తెలుసుకోవాలని హితవు పలికారు.
-
జగన్‌తో జాగ్రత్తగా ఉండండి – పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
-
తెలుగుదేశం వైపు తీన్మార్ మల్లన్న చూపు? – Crime Mirror
-
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్.
-
మీనాక్షి నటరాజన్ రాకతో టీకాంగ్రెస్‌లో మార్పు వస్తుందా..? – పార్టీలో కుమ్ములాటలు తగ్గుతాయా?
-
సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? – దీని వెనకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి..?