ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల్లో అర గ్యారెంటీని (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) మాత్రమే అమలు చేసి మిగతావి తుస్సుమనిపించారని,ఇది రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.‘‘రైతులందరికీ రుణ మాఫీ కాలేదని నిరూపించడానికి మేం సిద్ధం. పూర్తయిందని మీరు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ కార్యకర్తలం తా రాజీనామా చేస్తారు. రేవంత్.. మాతో గ్రామాలకు మీరు వస్తారా? మీకు సమయం లేకుంటే మంత్రులనైనా పంపించండి’’ అని సవాల్ విసిరారు.
తప్పులను ఎత్తి చూపుతున్న క్రైమ్ మిర్రర్ పై ఖాకీల కన్నెర్ర..!?
అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుగా తెలంగాణలోనే పూర్తిగా విఫలమైన సీఎం రేవంత్ ఢిల్లీలో చక్రం తిప్పుతానని అనడం పెద్ద జోక్‌గా పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం బీఆర్‌ఎస్ రైతు దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి రైతుకు రూ.15 వేలు చెల్లించాల్సిందే. రైతు కూలీలకు కూడా రూ.12 వేలు ఇవ్వాల్సిందేనని అన్నారు. రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించడం సరికాదన్నారు. ‘‘లోక్‌సభ ఎన్నికలకు ముందు రైతు భరోసా జమ చేసి తర్వాత చేతులెత్తేశారు. వానాకాలం పంట రైతు భరోసా రూ.7500 ఇవ్వలేదు. మేం నిలదీస్తుంటే దసరా, దీపావళి అని దాటవేశారు. ఇప్పుడు జనవరి 26 అని చెబుతున్నారు. ఇకనైనా ఇస్తారా? ఈ దీక్ష ఆరంభం మాత్రమే.
కర్ణాటక లో ఎం జరుగుతుంది?… వరుసగా రెండు రోజులు దొంగతనం?
కాంగ్రెస్ హామీలను అమలు చేయకుంటే వెంటాడుతూనే ఉంటాం. ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ కేసులు పెడుతోంది. ఎన్ని కేసులైనా భయపడేదే లేదు’’ అని అన్నా రు. ఒక్కో రైతుకు ప్రభుత్వం రూ.17,500, రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది మహిళలకు రూ.30 వేలు బాకీ పడిందని.. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం వస్తే ముందు ఈ డబ్బులను చెల్లించి ఓట్లు అడగండి అని డిమాండ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఉప్పల్ బగాయత్‌లో దారుణం.. మహిళను కారుతో ఢీకొట్టి హత్య చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి!