
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టిడిపి మద్దతు అడిగారని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు సామా రామ్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలంగాణ రాష్ట్రంలో అలాగే సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తుంది. సామ రామ్మోహన్ రెడ్డి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతుంటే.. కేటీఆర్ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం లోకేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. అలా జరగడానికి మాత్రం చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని విషయాలను బట్టి మనం ఇలా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ఏ జూబ్లీహిల్స్ కు జరగబోయే ఉప ఎన్నికల్లో మద్దతు కావాలి అని అనుకుంటే వైసీపీ మద్దతును కోరుతారు. గతంలో కేటీఆర్ జగన్ మోహన్ రెడ్డిని ఒక అన్నగా చూసేవారు. ఒకవేళ కచ్చితంగా ఆంధ్ర మద్దతు కావాలనుకుంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని మద్దతు కోరేవారిని పలు మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు అరెస్టు అయినప్పుడు కూడా కేటీఆర్ అన్న మాటలు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి. ఆ తర్వాత జగన్ గెలుపు కోసం కూడా కేటీఆర్ చాలానే ప్రయత్నాలు చేశారు. కాబట్టి కేటీఆర్ చేసిన ప్రతి ఒక్కటి టిడిపి నాయకులకు గుర్తుండే ఉంటుంది. కాబట్టి కేటీఆర్ టిడిపిని మద్దతు కోరేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి.
తాజాగా మాగంటి గోపీనాథ్… మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ స్థానంలోనే రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాగంటి గోపీనాథ్ టిడిపి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఆయన రాజకీయ జీవితం అంతా కూడా టీడీపీ నే. కాబట్టి ఆయనపై అలాగే ఆయన కుటుంబం పై చంద్రబాబుకు సానుభూతి ఉండడంతో.. కేటీఆర్ ఆ కోణంలోని సంప్రదించి ఉండవచ్చు అని అంచనావేస్తున్నారు.