తెలంగాణ

కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ అరెస్ట్? FIRలో కీలక ఆధారాలు.

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని లగచెర్లలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీప్ జైన్ సహా ఉన్నతాధికారులపై జరిగిన దాడి కేసులో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో బడా నేత అరెస్టుకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దాఖలు చేసిన FIRలో కీలక అంశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ప్రస్తావించారు. పోలీసులు. కేసులో తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో ఈ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. కలెక్టర్ పై దాడి ఘటనలో కుట్ర చేశారని నరేందర్ రెడ్డిపై పోలీసులు అభియోగాలు మోపారు. భారీ బందోబస్తు మధ్య వికారాబాద్ నుంచి కొడంగల్ కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డిని తీసుకొచ్చారు పోలీసులు.

వికారాబాద్ డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తుండగా నరేందర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు.. వికారాబాద్ డీటీసీ సెంటర్ కు తరలించారు. అక్కడే దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. కలెక్టర్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేశ్ తో ఫోన్ లో ఏం మాట్లాడరని ప్రశ్నించారని తెలుస్తోంది. అనంతరం పరిగి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button