జాతీయం

వాళ్లు హాస్పిటల్లోకి అడుగు పెట్టొద్దు, కేంద్రం సంచలన నిర్ణయం!

డ్రగ్ మాఫియా రెచ్చిపోతున్న నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసె్‌స(డీజీహెచ్‌ఎస్‌) కీలకనిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లను వైద్యులతో నేరుగా కలవడంపై నిషేధాన్ని విధించింది. ఫార్మా సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో పంచుకోవాలే తప్ప, డైరెక్టుగా డాక్టర్లను కలవకూడదని తేల్చి చెప్పింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే?

మెడికల్ రిప్రజెంటేటివ్‌ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఆస్పత్రులలోకి వారిని రాకుండా నిషేధించింది. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. లేటెస్ట్ మెడికల్ విధానాలు, మెడిసిన్స్ కు సంబందించిన సమాచారాన్ని కేవలం డిజిటల్ పద్దతుల ద్వారా పంచుకోవాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్పిటల్స్ లో నేరుగా కలవకూడదని తేల్చి చెప్పింది. నిబంధనలను పట్టించుకోని వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించింది.

Read Also: కోరిక తీర్చలేని భార్యకు నిప్పు పెట్టిన సైకో భర్త.. మరీ ఇంత ఘోరమా?

వైద్య సేవలను అంతరాయం

ప్రస్తుతం ఆయా ఫార్మా సంస్థలకు చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులను నిత్యం కలుస్తారు. తమ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి వారికి వివరించడంతో పాటు వాటిని రికమెండ్ చేస్తే కమిషన్స్ ఇస్తామని, ఇతర ప్రయోజనాలను చేకూర్చుతామని హామీలు ఇస్తున్నారు. అయితే, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు ఇష్టారీతిన వైద్యులతో సమావేశం కావడం వల్ల రోగులకు అందే వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతుంది. కొన్ని చోట్ల ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లుగానే వైద్యులు, రోగులకు ఔషధాలను రాస్తున్నారు. ఫలితంగా రోగులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తూ, వారు లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కఠినంగా అమలు చేయాలని నిర్ణయంచింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు రాకూడదనే నిబంధన గతంలోనే ఉంది. వాటిని ఇప్పుడు కచ్చితంగా అమలు చేయాలని మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Read Also: 3 గంటల పని.. 50 వేల జీతం.. సీన్ కట్ చేస్తే లబోదిబో!

Back to top button