
Komatireddy Venkat Reddy Angry: హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుల్లో నల్లగొండ మంత్రుల మధ్య టైమ్ వార్ నడించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేసి, అలిగి వెళ్లిపోయారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నాగార్జునసాగర్ డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తడానికి హెలికాప్టర్ ద్వారా సాగర్ కు రావాలని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం 9 గంటలకు హెలికాప్టర్ బయల్దేరాల్సి ఉంది. అనుకున్నట్లుగానే సరిగ్గా 9 గంటలకు కోమటిరెడ్డి, అడ్లూరి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కానీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయానికి రాలేదు. గంట వెయిట్ చేసిన ఆయన రాకపోవడంతో కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్ పోర్ట్ కు రావాలని చెప్పిన ఉత్తమ్.. ఆయన 10 గంటలు అయినా రాకపోవడం ఏంటని మండిపడ్డారు. ఉత్తమ్ ఆలస్యంపై అలకబూనాడు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయారు. కోమటిరెడ్డికి ఉత్తమ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా, వినకుండా వెళ్లిపోయారట. చివరకు కోమటిరెడ్డి లేకుండానే హెలికాప్టర్ లో మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ నాగార్జున సాగర్ కు బయల్దేరారు. నాగార్జునసాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్.
Read Also: నిండు కుండలా నాగార్జున సాగర్.. 2 గేట్లు ఎత్తనున్న అధికారులు!