
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-మునుగోడు నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పల కాపాడుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల చూపు చల్లగా ఉండాలని ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కంటి సమస్యలు వున్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ లు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 19న మునుగోడు లో ని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయం లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం లో 1058 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి చూపు మందగించిన 216 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు…. ఆపరేషన్ చేయించిన వాళ్లకి మళ్లీ ఆదివారం వైద్య శిబిరం నిర్వహించి ఆపరేషన్ చేసిన కన్ను ఎలా ఉంది అని పరీక్షలు చేయించారు.
కెసిఆర్ రంగంలోకి దిగితే… రేవంత్ రెడ్డి అయితే ఏంటయ్యా : హరీష్ రావు
కేవలం ఆపరేషన్లు చేయించిన వారికి మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిసినప్పటికీ గతంలో జరిపిన వైద్య శిబిరానికి రాని వాళ్ళు కూడా( కొత్త వాళ్ళు)రావడంతో 310 మంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు… వీరిలో 124 మందికి ఆపరేషన్లు అవసరమని వైద్యులు గుర్తించారు… 58 మందిని వెంటనే ఆపరేషన్ కోసం హైదరాబాద్ పంపించారు. మిగతా వారిని మంగళవారం రోజు పంపించి ఆపరేషన్ పూర్తి చేయిస్తారు… వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరిని పరిశీలించి వారి కంటిచూపు మెరుగయ్యేంతవరకు వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. తమ కడుపున పుట్టిన సొంత బిడ్డలే సరిగా పట్టించుకోని ఈ రోజుల్లో సొంత కొడుకు లాగా మా అందరికీ కంటి ఆపరేషన్లు చేయించడమే కాకుండా మళ్లీ మళ్లీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్న మనసున్న మంచి మారాజు మా రాజగోపాల్ రెడ్డి అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.