
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా కాషాయ బట్టలు ధరించి రాష్ట్రంలోని దేవాలయాలనే కాకుండా దేశంలోని దేవాలయాల అన్నిటిని కూడా సందర్శిస్తున్నారు. తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలను ధరించి సనాతన ధర్మాన్ని చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో దేవాలయాలు, ఎంతోమంది మతాలు మారడం అసలు మంచిది కాదని… మతం మారితే అమ్మను కూడా మార్చినట్లేనని అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా కూడా చాలా దేవాలయాలు దెబ్బతిన్నాయని… దేవాలయాలపై దాడులు జరిగాయి అంటూ చెబుతున్నారు. దేశంలోని చాలా దేవాలయాలలో దాడులు జరిగాయి అన్నది వాస్తవం. కాబట్టి ఇప్పటినుంచి ఈ దేవాలయంలోనైనా సరే దాడులు జరిగితే మాత్రం సహించబోనని అన్నారు.
ఎన్నికల పై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత..
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోలేని నాకు ఎన్ని పదవులు వచ్చిన వేష్టే అని అన్నారు. ఏ దేవుడైతే ఉనికిని ఇచ్చాడో, ఏ పరమాత్మ అయితే స్థానం ఇచ్చాడో ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులు వచ్చినా అసలు ప్రయోజనమే లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ నేను మూర్ఖంగా వాదించే హిందువుని కాదు. కానీ లౌకికవాదం పేరుతో హిందూ ధర్మాన్ని ఆచరించే వారి నమ్మకాలపై పదేపదే దాడులు చేస్తుంటే నాకు ఇబ్బంది అనిపించింది అని అన్నారు. దీనివల్ల మరో ఎలక్షన్ల సమయంలో ఓట్లు వస్తాయో పోతాయో అనే లెక్కలు నేను చూసుకోను అంటూ ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన చండూరు సన్ షైన్ పాఠశాల విద్యార్థులు..