కోల్కతా ట్రైనీ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ ను తాజాగా కోర్టు దోషిగా తేల్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై నిందితుడు సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. కోర్టు నా కొడుకుని దోషిగా నిరూపించడంతో ఒక తల్లిగా చెబుతున్నాను అతనిని ఉరి తీయండి అని అన్నారు. ఒక మహిళగా అలాగే తల్లిగా తప్పు చేసిన వాళ్లు కొడుకు అయినా లేదా ఇతరులైనా కచ్చితంగా శిక్షించాలని అన్నారు. నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, మరణించిన వైద్యురాలు తల్లి ఆవేదనను నేను అర్థం చేసుకోగలను అని అన్నారు. కాబట్టి ఈ విషయంలో నా కొడుకుకి మరణ శిక్ష విధించిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నిందితుడి తల్లి మాలతిని మెచ్చుకుంటున్నారు.
ఒక కన్న కొడుకు చేసిన తప్పుని తప్పుగానే చూసిన ఆ నిందితుడి తల్లి మాలతి ని ప్రతి ఒక్కరు కూడా శభాష్ అంటున్నారు. అయితే మరోవైపు ఈ కేసు విషయంలో సపోర్టుగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళను అంటూ నిందితుడి సోదరి కూడా చెప్పడంతో ప్రతి ఒక్కరూ షాకు కు గురయ్యారు.
ఇవి కూడా చదవండి
1.జనవరి 30న మంత్రివర్గ విస్తరణ!కొత్త మంత్రులు వీళ్లే..
2.సైఫ్ అలీ ఖాన్ పై దాడి!.. నిందితుడు బంగ్లాదేశ్ పౌరుడు?
3.ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు!!