గత ఏడాది ఆగస్ట్9వ తేదీన కోల్‌కతా ఆర్‌జీకర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. జూనియర్ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు ఉన్మాది సంజయ్‌రాయ్.. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్‌ను ఉరితీయాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి. తాజాగా కోర్టు అతడిని నిందితుడిగా నిర్ధారించింది.
11 వేల కోట్లు సంఖ్య కాదు!… ఎంతోమంది కుటుంబాలకు ఆశ?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా లేడీ డాక్టర్ హత్యాచార ఘటనలో కోర్టు తీర్పును వెల్లడించింది. నిందితుడు సంజయ్‌రాయ్‌ను దోషిగా నిర్ధారించింది సీల్దా కోర్టు.. సోమవారం ఉదయం 10.30 గంటలకు సంజయ్‌రాయ్‌కు శిక్షను ఖరారు చేయనుంది. 120 మంది సాక్ష్యులను విచారించిన కోర్టు తీర్పును వెల్లడించింది. సీబీఐ ఇచ్చిన ఆధారాలతో కోర్టు తీర్పును వెల్లడించింది. కోర్టు తీర్పు తరువాత గట్టి భద్రత మధ్య సంజయ్‌రాయ్‌ను జైలుకు తరలించారు.. అయితే తాను ఏ నేరం చేయలేదని , అన్యాయంగా కేసులో ఇరికించారని ఆరోపించాడు సంజయ్‌రాయ్.