IPL 2026: ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. రీసెంట్ గా 2026 ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం కూడా పూర్తయింది. ఐపీఎల్‌కి సంబంధించి ఏ వార్త అయిన ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) ఫ్రాంచైజీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్(Axar Patel)ను ఈ సీజన్‌లో ఆ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీ క్యాపిటల్స్ కు కొత్త కెప్టెన్
గత సీజన్‌లో ఢిల్లీకి రిషభ్ పంత్ స్థానంలో అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. ఆ ఫ్రాంచైజీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. మరోవైపు కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉన్నాడు. దీంతో కేఎల్ రాహుల్(KL Rahul) నాయకత్వంలో జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఢిల్లీ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. గతంలో పంజాబ్ కింగ్స్,లక్నో సూపర్ జెయింట్స్‌కి కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
అక్షర్ పటేల్ గురించి..
అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. గత ఆరేళ్లుగా జట్టుకు ప్రధాన బలంగా కొనసాగుతున్నాడు. ఒకవేళ కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ.. కీలక ప్లేయర్‌గా జట్టులోనే కొనసాగుతాడు. కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా అక్షర్ కేవలం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనపై దృష్టి పెడితే జట్టుకు మరింత ప్రయోజనం ఉంటుందని కోచింగ్ స్టాఫ్ భావిస్తున్నట్లు టాక్. త్వరలోనే కెప్టెన్ మార్పుకు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.





