ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

జగన్ భార్యపై దారుణమైన కామెంట్స్ చేసిన కిరణ్… చివరికి అరెస్ట్?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న నేతలు ప్రతిపక్ష పార్టీల కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది ప్రస్తుతం అరెస్టయి జైల్లో కూడా ఉన్నారు. అయితే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే తన భార్యపై ఐ టి డి పి కార్యకర్తగా పేరుపొందిన చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తో పాటుగా ఆయన సతీమణి భారతి రెడ్డి, జగన్ పిల్లలపై కూడా దారుణంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పెద్ద వివాదంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి కార్యకర్తలను అరెస్టు చేయించింది. ఇటువంటి తరుణంలో టిడిపి కార్యకర్తని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబం పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభమేనా అనే ప్రశ్న తలెత్తింది. దీంతో వెంటనే కూటమి ప్రభుత్వం పోలీసులకు కిరణ్ అరెస్ట్ చేయమని చెప్పారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ అనే వ్యక్తిని అరెస్టు చేయించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే సోషల్ మీడియా సక్సెస్ అయ్యాయి అని చెప్పాలి. అయితే ప్రస్తుతం చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి… ఇదే కేసులో అరెస్ట్ చేయించారు. దీంతో పరిస్థితి కొంచెం సద్దుమణిగిందనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఆంధ్రాలో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా చాలా అరెస్టులు జరిగాయి. వైయస్సార్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని… ప్రతిపక్ష పార్టీల సభ్యులపై అలాగే కుటుంబ వ్యక్తులపై ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూటమి నేతలు ఆరోపించారు. అయితే ఇప్పుడు ఇదే ప్రశ్నను వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అనుకోకుండా చేబ్రోలు కిరణ్ అనే టిడిపి కార్యకర్త అనూహ్యంగా జగన్ కుటుంబం పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీడీపీకి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉండడంతో వెంటనే అతనిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించారు. చేబ్రోలు కిరణ్ ను పోలీసులు మరికొద్ది గంటల్లో కోర్టులో హాజరుపరచునున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button