Tuesday, March 17, 2026
Homeజాతీయండిప్యూ సీఎం గొప్ప మనసు.. తన చార్టెడ్ ప్లేన్ లో పేషెంట్ ఆసుప్రతికి తరలింపు!

డిప్యూ సీఎం గొప్ప మనసు.. తన చార్టెడ్ ప్లేన్ లో పేషెంట్ ఆసుప్రతికి తరలింపు!

ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. కానీ, ఆ ఆలస్యమే ఓ మహిళా రోగికి వరంగా మారింది. తన విమానం మిస్ అయినా, ఏకంగా డిప్యూటీ సీఎం చార్టెడ్ ఫ్లైట్ లో ఆపరేషన్ కోసం సకాలంలో ముంబైకి వెళ్లింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

శీతల్ అనే మహిళకు ముంబైలోని ఓ  హాస్పిటల్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. అయితే, ఆమె వెళ్లాల్సిన విమానం మిస్ అయ్యింది. ఇదే విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి మెడికల్ అసిస్టెన్స్ సెల్‌ కు కాల్ చేసి విషయం చెప్పింది. తనకు సాయం చేయాలని కోరింది. సమయానికి తాను హాస్పిటల్ కు వెళ్లకపోతే, ఆ కిడ్నీని మరొక రోగికి అమర్చే అవకాశం ఉందని బాధపడింది.

వెంటనే స్పందించిన డిప్యూటీసీఎం

ఈ విషయం తనకు తెలియడంతో డిప్యూటీ సీఎం వెంటనే స్పందించారు. సదరు మహిళా పేషెంట్ కు ఆపన్న హస్తం అందించారు. అప్పటికే ఆయన చార్టడ్ విమానంలో ముంబైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సదరు మహిళ విషయం తెలియగానే, ఆమెను కూడా తన విమానంలో తీసుకెళ్లారు. అనుకున్న సమయంలో హాస్పిటల్ కు చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం చేసిన సాయాన్ని తన జీవితంలో మర్చిపోలేనని సదరు మహిళా పేషెంట్ చెప్పింది. తను లేకపోతే ప్రాణాలతో బతికి ఉండేదాన్ని కాదని చెప్పుకొచ్చింది. తన ప్రాణాలను కాపాడిని డిప్యూటీ సీఎంకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు చెప్పింది. ఈ విషయాన్ని జల్‌ గావ్ కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు.

ఈ ఘటన జరిగింది మహారాష్ట్రలో!

ఈ ఘటన జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో కాదు. మహారాష్ట్రంలో. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే మహిళకు సాయం చేశారు. ఆయన గొప్ప మనసుకు ప్రజలు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఓ నిండు ప్రాణాన్ని కాపాడిందంటున్నారు.

Read Also: బిస్కెట్ ప్యాకెట్ ధర రూ.2,400.. కప్పు కాఫీ రూ.1,800!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments