Thursday, March 19, 2026
Homeజాతీయంకెనడాలో ప్రధాని మోడీ.. దాడికి ఖలిస్థానీ వేర్పాటువాదుల కుట్ర!

కెనడాలో ప్రధాని మోడీ.. దాడికి ఖలిస్థానీ వేర్పాటువాదుల కుట్ర!

Khalistani’s Threaten: జీ7 సమావేశాల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడాకు వెళ్లారు. మోడీ కెనడా పర్యటన సందర్భంగా ఖలిస్థానీ వేర్పాటువాదులు ఆకస్మిక దాడులకు కుట్రలు చేశారు. ప్రధాని మంగళవారం నాడు కెనడాలో అడుగు పెట్టగా, ముందస్తుగానే దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అల్బెర్టా స్టేట్ లోని కల్గరీలో నిరసనలు తెలిపేందుకు ఖలిస్థానీ వేర్పాటువాదులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా  ఆకస్మిక దాడిగా వేర్పాటువాదులు ఈ కార్యక్రమాన్ని ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కిల్ మోడీ పాలిటిక్స్ అంటూ నినాదాలు చేశారు. కిల్ ఇండియా పాలిటిక్స్ అంటూ కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరసనకారులు పిలుపునిచ్చారు.

భారత త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తూ..

అటు ప్రధాని మోడీ, భారత వ్యతిరేక నినాదాలు చేయడంతో పాటు భారతీయ జాతీయ జెండాను కూడా ఖలిస్థానీ వేర్పాటువాదులు అవమానించారు. కొందరు నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని కింద పడేసి తొక్కారు. మరికొంత మంది భారత పతాకాన్ని చింపేశారు. ఈ నిరసనలను కవర్ చేసిన కెనడా జర్నలిస్టు డానియెల్‌ బార్డ్‌ మన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. మరోవైపు ఖలిస్థానీ వేర్పాటువాదుల తీరును సిక్కు సంస్థలు ఖండించాయి. విదేశాల్లో భారతదేశ పరువు తీయకూడదని హితవు పలికాయి. ఇలాంటి నిరసన కార్యక్రమాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని వెల్లడించారు. నిసరసన అనేది శాంతియుతంగా జరగాలే తప్ప, భారత పరువుపోయేలా ఉండకూడదని తేల్చి చెప్పాయి.

Read Also: ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ మృతి!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments