తెలంగాణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

  • హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ అధికారుల రాక

  • ఎస్‌ఐబీ, సిట్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో చర్చలు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో బీజేపీ నేత సంజయ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌

  • సంజయ్‌ ఫోన్‌ ఎక్కువ సార్లు ట్యాప్‌ అయినట్లు నిర్థారణ

  • రేపు సిట్‌ ఎదుట హాజరుకానున్న బండి సంజయ్‌

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఎస్‌ఐబీ, సిట్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే, గత బీఆర్‌ఎస్‌ హయాంలో బీజేపీ నేత బండి సంజయ్‌ ఫోన్‌ ఎక్కువ సార్లు ట్యాపింగ్‌కు గురైనట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. దీనిపై కేంద్ర హోంశాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

రేపు సిట్‌ ఎదుట హాజరుకానున్న బండి సంజయ్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శుక్రవారం రోజున సిట్‌ ఎదుట హాజరుకానున్నారు బండి సంజయ్‌. రేపు మధ్యాహ్నం 12గంటలకు బంజారాహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలం ఇవ్వనున్నారు. బండి సంజయ్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా సిట్‌ విచారణకు హాజరుకానున్నట్లో తెలుస్తోంది. కేంద్ర నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని, ఆధారాలను సిట్‌ అధికారులకు ఇవ్వబోతున్నారని సమాచారం.

ఇవీ చదవండి

  1. కాంగ్రెస్‌ నేతపైకి బాటిల్‌ను విసిరిన మహిళా ఎమ్మెల్యే

  2. బీసీ రిజర్వేషన్లపై ఆఖరిపోరాటం ముగిసింది: రేవంత్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button