ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ సంచలన ప్రకటన చేశారు. నన్ను మరోసారి అధికారంలోకి తీసుకువస్తే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తానని ప్రకటించారు. AAP చీఫ్ గా ఉన్న కేజ్రీవాల్ ఎలక్షన్లకు ముందు ఇలాంటి హామీలు ఇవ్వడం అనేది ఢిల్లీలో పెద్ద చర్చ నడుస్తుంది. కాగా ఇంతకుముందే జైలుకు వెళ్లి వచ్చిన కేజ్రీవాల్ వెంటనే కొత్త హామీలు ప్రకటించడం అనేది ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
కొత్తగా పెళ్లయిన మహిళలు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నారో తెలుసా?
తాజాగా నన్ను మరోసారి అధికారంలోకి తీసుకువస్తే , సీఎం అవ్వగానే ఢిల్లీలో 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. సీఎం అవ్వగానే సంజీవని పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సకి ఎంత ఖర్చైనా సరే మేము భరిస్తామని చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో జరగబోతుండగా అంతలోనే కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు కేజ్రీవాల్.
తెలంగాణలో చలి విజృంభన!.. రాబోయే రెండు రోజులు జాగ్రత్త?
అయితే ఎటువంటి జబ్బుకైనా లేదా ఎటువంటి అనారోగ్యానికైనా సరే ఎంత ఖర్చైనా మా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. ఎవరైతే మా కార్యకర్తలు ఉంటారో వారు ఇంటింటికి వెళ్లి మరి ఈ స్కీమ్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ దగ్గరుండి చేస్తారని పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు కూడా మా ప్రభుత్వము అండగానే ఉంటుందని తెలియజేశారు. బాగా ఆలోచించి ఈ పథకాన్ని తీసుకురాబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. మరి ఈ ఉచిత వైద్యం పట్ల మీరు ఎలాంటి అభిప్రాయం వెల్లడిస్తారో కింద కామెంట్ చేయండి.