
-
హరీశ్, సంతోష్ వెనుక రేవంత్: ఎమ్మెల్సీ కవిత
-
కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ అంటే బాధ కలుగుతోంది
-
తొక్కలో పార్టీ ఉంటే ఎంత… లేకుంటే ఎంత?
-
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు
-
తెలంగాణకు కేసీఆర్ తరగని ఆస్తి ఇచ్చారు
-
కేసీఆర్ పక్కనే ఉండి కుట్రలు పన్నారు: కవిత
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: హరీశ్‌రావు, సంతోష్‌రావు వల్లే దేవుడి లాంటి కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించడాన్ని కవిత తప్పుపట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత… కేసీఆర్‌పై సీబీఐ విచారణ అంటే కడుపు రగిలిపోతోందని ఆమె కంటతడి పెట్టారు. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు తిండిమీద, డబ్బుమీద యావ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తుల వల్ల ఇదంతా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తొక్కలో పార్టీ ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
కేసీఆర్‌పై సీబీఐ విచారణ వేశాక తొక్కలో పార్టీ ఉంటే ఎంత? లేకుంటే ఎంత అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇలా మాట్లాడినందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం కూడా జరగొచ్చని, అయినా కూడా తాను ఇలాగే మాట్లాడతానని ఆమె స్పష్టం చేశారు. హరీశ్‌రావు, సంతోష్‌రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. ఈ విషయం ఎంతవరకు వెళ్లినా తాను తేల్చుకుంటానని, కబడ్దార్ అని కవిత హెచ్చరించారు.
Read Also: