
-
కవితను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటన
-
కవిత తీరు పార్టీకి నష్టం చేకూర్చేలా ఉందని వ్యాఖ్య
-
కవితను తక్షణమే పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
క్రైమ్‌మిర్రర్, హైదరాబాద్: ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్ ప్రకటన విడుదల చేశారు. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్ పట్ల కవిత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సోమవారం రోజున మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌రావులపై కవిత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేఖలో ఇలా..
‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించేలా ఉన్నందున పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగిణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు టి.రవీందర్‌రావు, సోమ భరత్ కుమార్ పేరిట ప్రకటనను విడుదల చేశారు.
Read Also:
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి… కేంద్రానికి రేవంత్ సర్కార్ లేఖ