
-
బీఆర్‌ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే
-
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ వద్దనడం సరికాదు
-
చట్ట సవరణ చేసి ఆర్డినెస్ తేవడం మంచిదే
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ నేతల వైఖరిని కవిత తప్పుపట్టారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కార్ 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తీసుకురావడం సరైనదేనని కవిత ఖరాకండిగా చెప్పారు. బీఆర్‌ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెప్పడాన్ని కవిత తప్పుపట్టారు. న్యాయ నిపుణులతో చర్చించాకే బీసీ రిజర్వేషన్లకు జాగృతి మద్దతిచ్చినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని తామే సూచించినట్లు చెప్పుకొచ్చారు. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో నాలుగురోజులు సమయం తీసుకున్నా… బీఆర్‌ఎస్ నేతలు తన దారికి రావాల్సిందేనని జోస్యం చెప్పారు కవిత.
కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆర్డినెన్స్ తెచ్చినా… అది కోర్టులో నిలబడదని.. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని బీఆర్‌ఎస్ నేతలు సూచిస్తున్నారు.
Read Also: కాల్పులు జరిపిన గన్ మెన్సును వెంటనే డిస్మిస్ చేయాలి: కవిత