
క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి :-రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ప్రజా సేవకు అంకితమై, నిరంతరం రైతుల అభివృద్ధికి కృషి చేసే కాశెట్టి మోహన్ తాజాగా శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ముఖ్య అతిథిగా హాజరై, కాశెట్టి మోహన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాశెట్టి మోహన్ మాట్లాడుతూ, “రైతుల సంక్షేమమే నా ప్రథమ కర్తవ్యము. మార్కెట్లో సదుపాయాలు మెరుగుపరిచేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను” అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మండల, మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని కాశెట్టి మోహన్ కు అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా మోహన్ తనదైన శైలిలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.